బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత..!
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. ఎంపీ ప్రియాంకా గాంధీపై బీజేపీకి చెందిన నేత.. ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగారు.
దీంతో బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ దాడిలో బీజేపీ దళిత మోర్చా నాయకుడితో పాటు పలువురి పోలీసు సిబ్బందికి గాయలైనట్లు తెలుస్తుంది.