కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కేటీఆర్ అంటూ ఫేక్ ప్రచారం..!

KTR
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి ఇటు బీఆర్ఎస్ పార్టీపై.. అటు బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలు కేసీఆర్.. కేటీఆర్.. హారీష్ రావు.. కవిత దగ్గర నుండి మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, తలసాని మాజీ తాజా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలపై తమ అనుకూల పత్రికల్లో తప్పుడు వార్తలను రాయిస్తూ అసత్య ప్రచారం చేయిస్తున్నదని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే.
ఈ వార్తలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తిప్పికొడుతున్న మరి ఎక్కువగా రాయిస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పై వారు విరుచుకుపడుతు న్నారు . తాజాగా రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో సంచలన సృష్టించిన అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాస్తం ఉందని ఓ వార్తను ఓ పత్రికలో ప్రచురితమైనట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది.
ఈ వార్తలపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయమంటే బీఆర్ఎస్సోళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను రాయించి శునకానందం పొందుతున్నారు అని విరుచుకుపడుతున్నారు. మీరు చూడండి ఆ ఫేక్ ప్రచారం ఏంటో..!
PIC Credit Social Media

