10ఎకరాల్లోపే రైతు భరోసా
కేవలం పది ఎకరాల్లోపే ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా పథకం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది.
ఈ రోజు ఖమ్మంలో జరిగిన రైతుభరోసా పథకం పై ఖమ్మం ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల నుండి మంత్రులు పొంగులేటి ,తుమ్మల,భట్టి విక్రమార్క బృందం పలు అభిప్రాయాలను సేకరించింది.
ఈ అభిప్రాయాల మేరకు కేవలం పది ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలి.. కౌలు రైతులకు సబ్సిడీపై వ్యవసాయానికి సంబంధించిన వాటిని అందజేయాలి.. అన్ని రకాల పంటలకు మద్ధతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది.