కోటి ఎకరాలకే రైతు భరోసా..?
ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుండి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే.
ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలో సాగుచేసే కేవలం కోటి ఎకరాలకు మాత్రమే రైతు భరోసాని ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇందుకు ఐదు వేల నుండి ఆరు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పన్నెండు సార్లు కోటి యాబై లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు ఇచ్చింది.