పండక్కి వచ్చారు.. కోట్లు కొల్లగొట్టారుగా..!

సంక్రాంతి పండగ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా.. అందాల రాక్షసి మీనాక్షి చౌదరి, ఫ్యామిలీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా.. విక్టరీ వెంకటేష్ హీరోగా నిన్న సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.
సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది ఈ మూవీ. ఫస్ట్ డే సుమారు నలబై ఐదు కోట్లను వసూలు చేసినట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లతో వెంకీకి ఆల్‌టైమ్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని తెలిపింది.

