141 ఏళ్ల చరిత్రలోనే తొలిసారి..!

106 in 6 minutes. Melu.. Hats off police..!
పాకిస్థాన్ జట్టుతో ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 34 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై తొలిసారి విండీస్ టెస్టు గెలిచింది. బౌలర్ జోమెల్ వారికన్ 9 వికెట్లతో చెలరేగడంతో విండీస్ 120 రన్స్ తేడాతో విజయం సాధించింది.
ఆ జట్టు పాకిస్థాన్ లో టెస్టుల్లో చివరిగా 1990లో గెలవడం గమనార్హం. రెండు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేశాయి.ఈ మ్యాచ్ లో పాక్ స్పిన్నర్ నోమన్ అలీ రికార్డు సృష్టించారు. 141 ఏళ్ల చరిత్రలో మ్యాచ్ తొలిరోజు మొదటి గంటలోనే హ్యాట్రిక్ వికెట్లు తీసిన స్పిన్నర్ గా నిలిచారు.
1883లో ఆసీస్ బౌలర్ బిల్లీ గేట్స్ ఈ ఘనత సాధించారు. అలాగే ఫస్ట్ సెషన్లోనే హ్యాట్రిక్ తీసిన ఆరో బౌలర్ గా, సెకండ్ ఓల్డెస్ట్ ప్లేయర్ (38Y 139D)గానూ నిలిచారు. శ్రీలంక క్రికెటర్ రంగన హెరాత్ 38Y 110D వయసులో హ్యాట్రిక్ తీశారు.
