సీఎం అయిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అనుముల రేవంత్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఈ క్రమంలో తిరుమల శ్రీవారి సేవలో పాల్గోన్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ప్రార్థించాను.
తెలంగాణలో మంచి వర్షాలు కురవాలని కోరుకున్నాను.. తెలంగాణ నుంచి వచ్చే భక్తుల కోసం సత్రం, కల్యాణమండపం నిర్మాణానికి కృషిచేస్తాను. దేశ సంపదను పెంచడమే మా ప్రభుత్వ కార్యాచరణ, రైతులను ఆదుకోవడమే మా లక్ష్యం అని అన్నారు.