తెలంగాణ కాంగ్రెస్ లో తొలి వికెట్ డౌన్…!

తెలంగాణ కాంగ్రెస్ లో రోజుకో సంచలనం తెరపైకి వస్తుంది..ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేయటం,అంతకు ముందు కాంగ్రెస్ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోల్ పెట్టి ఖంగుతిన్న విషయం తెలిసిందే..వరుస వివాదాలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అదిష్టానం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది.
అందుకే అదిష్టానం ఇప్పటికే ఎమ్మెల్యేలతో చర్చించినట్టు తెలుస్తుంది..ఎమ్మెల్యేల విషయం అటుంచితే కాంగ్రేస్ సోషల్ మీడియా పెట్టిన పోల్ పెద్ద సంచలనానికి తావిచ్చింది.కేసీఆర్ సైతం దీని గురించి మాట్లాడారు.ప్రజల్లో వ్యతిరేఖత ఉన్న సమయంలో పోల్ పెట్టి పార్టీని,ప్రభుత్వాన్ని మరింత డిపెన్స్ లోకి నెట్టడం పట్ల అదిష్టానం చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తుంది.
కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్,టీఎస్టీఎస్ చైర్మన్ రెండు పదవుల నుండి మన్నె సతీష్ కుమార్ ను తొలగించనున్నట్టు తెలుస్తుంది..మన్నె సతీష్ స్థానంలో గుత్తా అమిత్ లేదా పెద్దపల్లి వంశి ని నియమించనున్నట్టు తెలుస్తుంది..ఒక్క పోల్ రాజకీయంగా పెనుదుమారాన్ని రేపడంతో పాటు పదవులూ ఊడుతుండటం ఇప్పుడు సంచలనంగా మారింది.
