6గ్యారంటీల్లో 5గ్యారంటీలు అమలు చేశాం

గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ నిధుల విడుదల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “ఆరు గ్యారంటీలలో ఇప్పటికే 5 గ్యారంటీలు అమలు చేశాము..
అమలు చేసిన 5 గ్యారంటీలకు ఇప్పటి వరకు 29 వేల కోట్ల రూపాయిలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది.. ఆరోగ్య శ్రీ, ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు లాంటి ఐదు గ్యారంటీలను అమలు చేశాము అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు..
