జగన్ 2019కి ముందు వేరు.!.తర్వాత వేరు.. !!

వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎదిరించి మరి తన తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ అకాల మరణంతో చనిపోయిన పార్టీ కార్యకర్తలు.. ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శ చేస్తూ చేసిన మహాపాదయాత్ర. ఆ సమయంలోనే ఎన్నో కుట్రలు.. అక్రమ కేసులను ఎదుర్కున్న ధీరుడు. దాదాపు ఏడాది పాటు జైల్లో ఉండి కూడా ప్రజల గురించి ఆలోచించిన ప్రజానాయకుడు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సింగల్ గా 151స్థానాల్లో గెలిపించిన అపర రాజకీయ చాణిక్యుడు.
అలాంటి చాణిక్యుడు అధికారంలోకి వచ్చాక మారిపోయాడని ఇటు ఆయన సన్నిహితులు.. పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటారు. అది నిజమే అన్నట్లుగా 2019లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తాను పడిన కష్టం.. చేసిన పాదయాత్ర కాకుండా ప్రముఖ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ అని బలంగా నమ్మిండు జగన్. అందుకే అప్పటి నుండి ఆ టీమ్ మాటలు ఎక్కువగా నమ్మాడు.. సూచనలను సలహాలను పాటిస్తూ అమలు చేశాడు. అందుకే గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైయ్యాడు అని విశ్లేషకుల అంచనా.. 2019 ఎన్నికల్లో పనిచేసిన పీకే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో దూరంగా ఉన్నాడు.
ఇక్కడ ఆయన పెట్టిన టీమ్ పని చేసింది తప్పా పీకే కాదు. ఇక్కడే ప్రస్తుతం వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి కి ఐప్యాక్ టీమ్ కు చెడింది. కష్టాల్లో నష్టాల్లో తోడున్న విజయసాయిరెడ్డి లాంటి నాయకుల మాటలను జగన్ పెడచెవిన పెట్టడంతో అధికారం కోల్పోయాక ఒకరి తర్వాత ఒకరు ఇటు పార్టీకి అటు పదవులకు రాజీనామా చేస్తున్నారు అని ఏపీ పాలిటిక్స్ లో ఇన్నర్ టాక్. అధికారంలోకి రాకముందు జగన్ వేరు..
అధికారంలోకి వచ్చాక జగన్ అని వైసీపీ శ్రేణులు బాహటంగా చర్చించుకుంటున్నారు. ఐప్యాక్ టీమ్ చెప్పినట్లుగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో క్షేత్రస్థాయిలో ఉన్న జెన్యూన్ రిపోర్టు పైకిపోకపోవడం.. జగన్ వీళ్ళు చెప్పిందే వేదంగా భావించడంతో విజయసాయిరెడ్డి లాంటి నాయకులు అసంతృప్తికి గురి అయ్యారు. దీంతోనే ఒకరి తర్వాత ఒకరూ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికైన 2019కి ముందు జగన్ మళ్లీ వైసీపీ శ్రేణులకు పరిచయం కావాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
