మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!
తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య ఈరోజు మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈరోజు ఉదయం ఆయన కన్నుమూశారు. 1983లో బూర్గంపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన ఊకే అబ్బయ్య ఆ తర్వాత 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల పలువురు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.