మాజీ ఎంపీ కన్నుమూత..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు.. మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం (78) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శ్రీకాకుళం లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
పాలవలస రాజశేఖరం ముందుగా జెడ్పీ చైర్మన్ గా రాజకీయ ప్రస్థానం మొదలెట్టారు. 1994లో ఉణుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రాజ్యసభ సభ్యులుగా సేవలు అందించారు.. ఆయన కుమారుడు పాలవలస విక్రాంత్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.కూతురు శాంతి పాతపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే.
