వేములవాడలో రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వేములవాడలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఇందులో రూ. 236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయనున్నరు…
రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. 50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు..
మరో రూ 47 కోట్ల 85 లక్షలతో మూల వాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులు.. 42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. మరోవైపు రూ. 28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు.