ఫ్రీ బస్సు ఎఫెక్ట్ -ఆర్టీసీ కీలక నిర్ణయం
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఉచిత బస్సు ప్రయాణం వల్ల టికెట్లు తీసుకుని ఎక్కిన వాళ్లకు కూర్చోవడానికి సీట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది..
దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఇప్పటికే బస్సుల సంఖ్య తగ్గడం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు..
అందుకే ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఇప్పటికి ఉన్న చార్జీల కంటే 5-6% ఎక్కువగా.. డీలక్స్ లో 4% తక్కువగా చార్జీలు ఉండేలా బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తుంది.. అయితే ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేకుండా మార్పులు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు…