అధికార లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ అంతక్రియలు..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) నిన్న గురువారం రాత్రి కన్నుమూశారు. మన్మోహన్ మృతికి పలు వురు ప్రముఖుల సంతాపం తెలియజేస్తున్నారు. మన్మో హన్ సింగ్ నివాసానికి పలువురు ప్రముఖులు చేరుకుంటున్నారు.ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని తన నివాసంలో మన్మోహన్ పార్ధీవ దేహం ఉంచారు. రేపు శనివారం మన్మోహన్ సింగ్,అంత్య క్రియలు నిర్వహించే అవకాశం ఉంది. అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇవాళ ఉదయం 11 గంట లకు కేంద్ర మంత్రి వర్గం సమావేశం జరగనుంది. మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతా పదినాలు ప్రకటించనున్నా రు. కాంగ్రెస్ కూడా పార్టీ కార్యక్రమాలను అన్నింటిని రద్దు చేసింది.మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సంతాపాన్ని తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప నాయ కుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.