గంభీర్ కు పదవి గండం..!

Gautam Gambhir
భారత జట్టు ఇటీవల జరిగిన ప్రపంచ టీ20 కప్ విజయం సాధించే వరకు కోచ్ గా వ్యవహరించారు బారత స్టార్ క్రికెటర్,మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్.అతను కోచ్ గా ఉన్నంత కాలం జట్టును ఐక్యంగా ముందుకు నడిపించి ఎన్నో విజయాలనందించాడు.
అయితే ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియడంతో తప్పుకున్నారు .. రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత్ జట్టు మాజీ ఒపెనర్,సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను కొత్త కోచ్ గా నియమించింది.గంభీర్ టీమిండియా కోచ్ గా వచ్చిన తర్వాత టీ20 సిరీస్ మినహా భారతజట్టు పేలవ ప్రదర్శనే కనబరించింది. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ కోల్పోయింది.ఘోర ఓటమిని చవిచూసింది.
అనంతరం ఆస్టేలియా లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోపీని సైతం 3-1 తో కోల్పోయింది.BGT లో గెలిచే అవకాశం ఉన్న మ్యాచులను చేజేతులారా ఓడింది.దీంతో ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ రేసు నుండి భారత్ తప్పుకుంది.దీంతో గంబీర్ పై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.త్వరలో జరగబోయే చాంపియన్స్ ట్రోపీలో జట్టు ప్రదర్శనపై గంబీర్ కోచ్ పదవి ఆదారపడి ఉన్నట్టు తెలుస్తుంది..
ఛాంపియన్స్ ట్రోపీలో ఒకవేళ విఫలం అయితే బీసీసీఐ సమావేశం నిర్వహించి గంభీర్ ను కోచ్ పదవి నుండి తప్పిస్తారని జాతీయ మీడియాలో వార్తలు ప్రచురితమౌతున్నాయి.మరి ఛాంపియన్స్ ట్రోఫీని ఛాలెజింగ్ గా తీసుకుని జట్టును విజయాల బాటలో నడిపిస్తారా..? లేక చేతులెత్తేసి తప్పుకుంటారా?..తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరి..!!
