5రోజుల్లో “గేమ్ ఛేంజర్స్ ” కలెక్షన్లు ఎంతంటే..!

GameChanger
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి కియరా అద్వానీ హీరోయిన్ గా.. శ్రీకాంత్ ,సముద్రఖని, రాజీవ్ కనకాల ,అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఈ నెల పదో తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్స్.
ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా శంకర్ దర్శకత్వం వహించాడు. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ ఐదు రోజుల్లో వందకోట్ల రూపాయలను నెట్ కలెక్షన్లను సాధించినట్లు ఇండియా టుడే తెలిపింది. మొదటి రోజు యాబై ఒక్క కోట్లను వసూలు చేసింది. ఆ తర్వాత వరుసగా నాలుగు రోజుల్లో రూ.21.6కోట్లు.. రూ.15.9కోట్లు.. రూ.7.65కోట్లు.. రూ.10కోట్లను వసూలు చేసిందని పేర్కొన్నది.
