మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న రేట్లు ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం (పది గ్రాములు) రూ. 820లు పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.79,640లు పలుకుతుంది.
మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.750లు పెరిగింది. దీంతో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం రూ.73,000లు పలుకుతుంది.ఇంకోవైపు కిలో వెండి ధర రూ. 1,01,000లుగా ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే ధర పలుకుతుంది.