బీఎస్ఎన్ఎల్ శుభవార్త
టెలికామ్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా వైఫై రోమింగ్ హైదరాబాద్ మహానగరంలో విజయవంతమైందని ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ల్యాండ్ లైన్ కే ఫైబర్ టూ హోమ్ కనెక్షన్లు ఇస్తున్నది.
ఇంట్లో ఉండే వైఫై యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో కార్యాలయంలో లేదా మరెక్కడూన్న వైఫై వాడుకోవచ్చు.FTTH టవర్ ద్వారా దేశ వ్యాప్తంగా ఈ సేవలను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది.
దీనికి సర్వత్రా బ్రాండ్ అనే పేరు పెట్టారు. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.