ఐపీఎల్ క్రికెటర్లకు శుభవార్త
ఐపీఎల్ సీజన్ లో ఆడే క్రికెటర్లకు పంట పండింది. వచ్చే ఏడాది నుండి జరగబోయే ఐపీఎల్ సీజన్ లో ప్రతి ఆటగాడ్కి మ్యాచ్ ఫీజు కింద రూ.7.50లక్షలు ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు.
లీగ్ మ్యాచులన్నీ ఆడిన క్రికెటర్లకు కాంట్రాక్టెడ్ అమౌంటుకు అదనంగా రూ. 1.05కోట్లు ఇస్తామని జైషా ఈ సందర్భంగా వెల్లడించారు.
మ్యాచ్ ఫీజు చెల్లించేందుకు ప్రతి ఫ్రాంచైజీ రూ.12.60కోట్లు చెల్లించాలని చెప్పారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం అని జైషా తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.