ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్..?
పాన్ ఇండియా స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ వార్-2 చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెడుతున్న సంగతి తెల్సిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
యద్రాజ్ ఫిలింస్ బ్యానర్లో సినిమా ఉంటుందని, సరైన కథ కోసం మేకర్స్ సెర్చ్ చేస్తున్నారని సమాచారం. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారని టాక్.
త్వరలోనే కొత్త ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన ఉంటుందని బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రాలతో బాలీవుడ్ లో సత్తా చూపడానికి తాపత్రయపడుతున్నాడు.