రేషన్ కార్డులేని 6లక్షల మంది రైతులకు శుభవార్త
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజాభవన్ లో జరిగిన ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ…మంత్రులు..డీసీసీ ముఖ్యనేతల సమావేశంలో రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతురుణమాఫీ చేయడానికి నిద్రలేని రాత్రులను ఎన్నో గడిపాము..
రూపాయి రూపాయి పొగేసి రుణ మాఫీ చేస్తున్నాము..రేపు ఒక్కరోజే ఏడున్నరవేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేయబోతున్నాము.. రేషన్ కార్డు లేని ఆరు లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ చేస్తాము.
రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి ఓటరు దగ్గరకు తీసుకెళ్లాలి.. రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న కానీ రుణమాఫీ ప్రక్రియను ఒకేవిడతలో చేస్తున్నామని మరోకసారి ఉద్ఘాటించారు..