టీమ్ ఇండియా కు శుభవార్త
త్వరలో న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం కారణంగా తొలి టెస్టుకు శుభమన్ గిల్ దూరమైన సంగతి తెల్సిందే.
తాజాగా గాయం నుండి కోలుకున్నా గిల్ అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. మరోవైపు పంత్ కూడా ఫిట్గా ఉన్నారని పేర్కొన్నారు.
మరోవైపు తొలి టెస్ట్ లో శుభమన్ గిల్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి మనకు తెలిసిందే. దీంతో విఫలమైన కేఎల్ రాహుల్ ను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి.