తెలంగాణ రైతాంగానికి శుభవార్త
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.ఇందులో భాగంగా రానున్న వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేస్తున్న రైతులకు ‘రైతు భరోసా’ అమలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు.
జులైలో ఎకరానికి ₹7,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదార్లకు భరోసా సాయం అందుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారమే ఆగస్టు 15లోపు ₹2లక్షల రుణమాఫీ కచ్చితంగా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి తుమ్మల.