రైల్వే ప్రయాణికులకు శుభవార్త
రైల్వే ప్రయాణికులకు కేంద్ర సర్కారు శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా రైల్వేల కోసం కేటాయించిన రూ.2.62 లక్షల కోట్ల రైల్వే బడ్జెట్ లో రూ.1.08 లక్షల కోట్లు భద్రత కోసం వినియోగిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2500 జనరల్ కోచ్‌లు తీసుకొస్తున్నామన్నారు. మరో 10వేల కోచ్‌లను తయారు చేస్తామన్నారు.
బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించామన్నారు. అటు ఒక్కో రైలులో మూడింట రెండొంతులు సాధారణ కోచ్‌లు, ఒక వంతు ఏసీ కోచ్‌లు ఉండేలా చూస్తామని కేంద్ర మంత్రి అన్నారు .