నిరుద్యోగ యువతకు శుభవార్త
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది నిజంగా శుభవార్తనే..రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ల పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు ఆర్ఆర్బీ ప్రకటించింది.
ముందుగా మొత్తం 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఆర్ఆర్బీ.. తాజాగా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో 1,364 పోస్టులు పెరిగాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అయింది.. అయితే జులై-ఆగస్టులో CBT-1 పరీక్ష ఉండనుంది. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/ .