కొండ పోచమ్మ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలి.

కొండ పోచమ్మ రిజర్వాయర్ లో ఈత కు వెళ్ళి మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ ఘటన లో బన్సీలాల్ పేట డివిజన్ లోని CC నగర్ కు చెందిన కిషన్, సుమలత దంపతుల కుమారుడు దినేష్ ( 17) కూడా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం వారి నివాసానికి వెళ్ళి దినేష్ పార్దీవ దేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తల్లిదదండ్రులను పరామర్శించి తన ప్రగడ సంతాపం, సానుభూతిని తెలిపారు.
ఒక్క గానొక్క కుమారుడు దినేష్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న వారిని ఎంతో కలచి వేసింది. MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ దినేష్ తండ్రి కి వ్యక్తిగతంగా ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల జీవితం ఆర్ధాంతరంగా ముగిసిపోవడం విచారకరం అని పేర్కొన్నారు. గుడికి వెళ్ళొస్తానని చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన కొడుకు విగతజీవిగా రావడం ఆ తల్లిదదండ్రులకు తీరని శోకం అని అన్నారు.
తమ పిల్లల భవిష్యత్ పై ఎన్నో ఆశలతో ఉన్న తల్లిదండ్రులకు విధి విషాదం మిగిలించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాల్సిన వారి ఇండ్లలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు. ఈ ఘటన లో మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు కూడా తన ప్రగాడ సంతాపం, సానుభూతిని ప్రకటించారు. అంతా నిరుపేద కుటుంబాలని, వారికి ఒక్కో కుటుంబానికి 20 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. MLA వెంట కార్పొరేటర్ కుర్మ హేమలత, లష్కర్ జిల్లా సాధన సమితి అద్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, BRS పార్టీ డివిజన్ అద్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, లక్ష్మీపతి, రమణ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
