హ్యాపీ బర్త్ డే నరైన్
ఎవరికి సాధ్యం కాని తనకే సొంతమైన మిస్టరీ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల ప్లేయర్ సునీల్ నరైన్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.
పొట్టి క్రికెట్ ఫార్మాట్ లోనే అత్యధిక వికెట్లు (551) తీసిన వారి జాబితాలో మూడో స్థానంలో నరైన్ ఉన్నారు.
ఐపీఎల్ సీజన్ లో ఒకే టీమ్(KKR) తరఫున అత్యధిక వికెట్లు (179) తీసింది.. సూపర్ ఓవర్ ను మెయిడిన్ వేసిన ఏకైక బౌలరూ కూడా సునీల్ నరైన్ కావడం విశేషం. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో మొత్తం 482 రన్స్, 16 వికెట్లు తీశారు.