కాళ్ల మధ్య కట్టెలు పెడుతున్న హారీష్ ,కేటీఆర్..!
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హాయాంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేయలేని పనులను గత పదకొండు నెలలుగా తాము పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు.
వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది.ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే మాజీ మంత్రులు కేటీఆర్ , హరీశ్ మన కాళ్ల మధ్య కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పదేండ్లు సరిగా పరిపాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు. రూ.11వేల కోట్ల రుణమాఫీకి కేసీఆర్ పదేళ్లు తీసుకున్నాడు..కానీ మేము తాము 25 రోజుల్లో రూ.18వేల కోట్లు మాఫీ చేశామని ఆయన స్పష్టం చేశారు.