రజనీకి కన్పించిన హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ గజనీ లకు కన్పించలేదు
తెలంగాణ లో పదెండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో ప్లై ఓవర్లు బిల్డింగ్స్ తప్ప ఏమి అభివృద్ధి కాలేదని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు..
మీడియా తో మాట్లాడుతూ ” హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అంటున్నారంటే కండ్లు ఉండి కూడా చూడలేని కబోదిలు కాంగ్రెస్ వాళ్లు.హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్స్ రజినీకాంత్, ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులు అభినందిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని రజినీలు మెచ్చుకుంటే ఈ కాంగ్రెస్ గజినీలు చూడలేకపోతున్నారు.
హైదరాబాద్ అభివృద్ధి జరిగింది కాబట్టే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలింపించలేదు పట్టణ వాసులు ” అని అన్నారు..