కాంగ్రెస్ ప్రభుత్వంపై  నిప్పులు చెరిగిన హారీష్ రావు

 కాంగ్రెస్ ప్రభుత్వంపై  నిప్పులు చెరిగిన హారీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నిప్పులు చెరిగారు .. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు .. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నిరుద్యోగులకు లేనిపోని హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడెందుకు మాట తప్పుతోంది? నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లను ఆయన పెట్టారు.

  1. గ్రూప్ 1కు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలి.
  2. గ్రూప్ 2కు 2 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామన్న మీ మాట నిలబెట్టుకోవాలి.
  3. పరీక్షకు పరీక్షకు మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలి. జూలైలో డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 7,8న గ్రూప్ 2 ఉంది. 7 రోజుల గ్యాప్ మాత్రమే ఉండడంతో ఒత్తిడితో సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.
  4. ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలిస్తామని, జాబ్ కేలండర్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలలైనా జాబ్ కేలండర్ ఎందుకివ్వలేదు? హామీని నిలబెట్టుకోవాలి.
  5. 25 వేల పోస్టులతో కాకుండా 11 వేల పోస్టులతో డీఎస్సీ ఎందుకు ప్రకటించారు? మొత్తం 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *