రేవంత్ రెడ్డికి హారీష్ రావు సలహా..!

 రేవంత్ రెడ్డికి హారీష్ రావు సలహా..!

Harish Rao’s advice to Revanth Reddy..!

Loading

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉంది.మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజులు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదని, ప్రెస్ మీట్ పెట్టావు.ఎప్పుడో అయిపోయిన దావోస్ కు ఇప్పుడు ఎందుకు ఈ దావతు. దావోస్ లో జరిగే ఎంఓయూలు అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే, ఎవరైనా ఓపెన్ టెండర్ లో రావాల్సిందే..

అని ఆర్థిక మంత్రి భట్టి గారు అంటే, మీరేమో లక్షా 82 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు గప్పాలు చెబుతున్నారు. భట్టి గారు చెప్పింది నిజమా?.మీ మాటలు నిజమా? రేవంత్ రెడ్డి గారూ..పొంతన లేకుండా మీరు చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెక్కలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించింది. అంతా డొల్ల ప్రచారం అని తేలిపోయింది.రైతు భరోసా కోసం గంపెడు ఆశతో, కొండంత ఆందోళనతో ఎదురుచూస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటవా? .ఇంతక ముందు రైతు బంధును బిచ్చం అన్నవు, ఇప్పుడు రైతు భరోసాను చిల్లర పంచాయతీ అంటున్నవు.

సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోయింది, చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యింది, ఇప్పుడు మార్చి 31 దాకా గడువు పెంచినవు.జర్నలిస్టులు ఇదేమని అడిగితే, చిల్లర పంచాయితీ అంటున్నవు.అప్పుల పాలవుతున్న రైతుల ఆవేదన పక్కన పెట్టీ మీ ప్రచారం వినాలా?.రైతుల అప్పులు ముఖ్యమా.? .దావోస్ డప్పులు ముఖ్యమా..?.మీ సెల్ఫ్ డబ్బా కు, మీ వెకిలి సెటైర్లకు కాలం చెల్లింది. ఇకనైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. నీలో అటెన్షన్ డిక్రీసింగ్ డిజార్డర్ మొదలైంది. నీ మాటలు ఎవరు నమ్మడం లేదనే ఆందోళన పెరిగిపోయింది. మంచి మానసిక వైద్యుడిని సంప్రదించడం మంచిదని” ట్వీట్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *