సంక్రాంతికి ఊర్లకెళ్లేవాళ్లకు హారీష్ రావు పిలుపు..!

 సంక్రాంతికి ఊర్లకెళ్లేవాళ్లకు హారీష్ రావు పిలుపు..!

Loading

సంక్రాంతి పండుగకి ఊర్లకు వెళ్లుతున్న వారికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఓ పిలుపునిచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” సంక్రాంతి పండక్కి ఊర్లకు వెళ్లే అక్క చెల్లేల్లు.. అన్నతమ్ముళ్ళను ఒకటి కోరుతున్నాను. గత ఎన్నికల సమయంలో నాటీ పీసీసీ చీఫ్ గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ఇప్పుడు రైతుబంధు తీసుకుంటే కేవలం పదివేలు మాత్రమే.. మేము అధికారంలోకి వచ్చాక తీసుకుంటే పదిహేను వేలు ఇస్తామని హామీచ్చారు.

రైతు భరోసా కింద రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తామని అన్నారు. మహిళలకు రెండున్నర వేలు ఇస్తామన్నారు. రెండు లక్షల వరకు ఎలాంటి షరతుల్లేకుండా రుణమాఫీ అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రైతురుణమాఫీలో కోతలు పెట్టారు. రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామని ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తామని అంటున్నారు. పండిన ప్రతి పంటకు ఐదు వందల బోనస్ అన్నారు.

ఇప్పుడేమో వరి అది కూడా సన్నబియ్యం పంటకే ఐదు వందలు ఇస్తామంటున్నారు. అడుగడుగున రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ . రైతులను అడుగడుగున దగా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఊర్లకెళ్లే నా అక్కచెల్లె… అన్న తమ్ముళ్లకు ఒకటే విన్నపం.. మీ ఊర్లలో రైతులతో మీరు చర్చ పెట్టండి. మనమంతా రైతు బిడ్డలమే. రైతులను ఏలా కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారో అడగండి. మనమంతా కల్సి పోరాడి రైతులకిచ్చిన ఎన్నికల హామీల అమలుపై పోరాడుదాం” అని పిలుపునిచ్చారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *