ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డికి హారీష్ రావు విన్నపం

 ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డికి హారీష్ రావు విన్నపం

ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విన్నవిస్తూ ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా?
తక్షణమే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలకు పరిష్కారం చూపాలని, 7నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని “ట్వీట్ చేశారు..

ఈ సందర్భంగా సిద్దిపేట హాస్టల్ లో సిబ్బంది తనకు రాసిన లేఖను ట్విట్టర్లో పోస్టు చేశారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *