“హాస్తం” కు హాడల్..! అందుకే ఆలస్యం…!
తెలంగాణలో 2023 చివర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 64 స్థానాలతో విజయం సాదించి అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం.6 గ్యారెంటీలు ,పలు హామీలను గుప్పించి అదికారంలోకి వచ్చింది.అనంతరం వచ్చిన పార్లమెంట్ స్థానాల్లో 8 చోట్ల మాత్రమే విజయం సాదించింది.అదికార పార్టీ 17 స్థానాల్లో ఒకటి ఎఐంఎం కు వదిలిపెట్టినా కేవలం 10 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవటం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడలేదు.బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చినా అందులో కొందరు జంప్ అవ్వటం,పార్టీ అదికారంలో లేకపోవడంతో కొంత ఓటు డైవర్ట్ అయి బీజేపీకి పడటంతో బీఆర్ఎస్ కు ఒక్కసీటూ రాలేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త కలవరపాటుకు గురైన కాంగ్రెస్ పార్టీ,స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు శశబిషలాడుతుంది.సర్పంచ్ కాలపరిమితి ముగిసి ఏడాది ముగిసినా ఇంకా ఎన్నికలు జపకపోవటం వెనుక మతలబేంటని జనాల్లో చర్చ జరుగుతుంది.సర్పంచ్ ఎన్నికలంటే కాంగ్రెస్ భయపడుతుందా..? ఏడాది పాలనపై కాంగ్రెస్ కు నమ్మకంలేదా అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది..ఏడాది పాలనలో అనేక వివాదాలు,రైతుబంధు ఎగవేత,హైడ్రా లాంటి చర్యలు,హామీల అమలులో జాప్యం వెరసి ఏడాదిలోనో తీవ్ర వ్యతిరేఖత మూటగట్టుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం..పంచాయతీ ఎన్నికలకు వెల్తే గ్రామాల్లో తిరగలేని పరిస్థితి నెలకొందని గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు అదిష్టానానికి రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం.
అందుకే కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేస్తుంది.రైతుభరోసా రైతుల ఖాతాల్లో వేసి,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి అప్పుడు ఎన్నికలకు వెల్లాలని యోచిస్తుంది.అయితే రైతుభరోసాలో కొర్రీలు,ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక మరింత తలనొప్పిగా మారనుండటంతో ఏం చేయాలో పాలుపోక కాంగ్రేస్ అదిష్టానం తలపట్టుకుంది.ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే క్లీన్ స్వీప్ చేస్తామని ప్రతిపక్ష బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండటంతో కాంగ్రెస్ ఆలోచనలో పడింది.మరి భయం వీడి స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ నిర్వహిస్తుందా వేచి చూడాలి..