నేలపై కాదు గాల్లో తేలుతున్న కాంగ్రెస్ మంత్రులు..!

 నేలపై కాదు గాల్లో తేలుతున్న కాంగ్రెస్ మంత్రులు..!

Loading

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఏడాదిగా హామీల అమలు గురించి పక్కనెట్టి మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలే టార్గెట్ గా డైవర్శన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మభ్య పెడుతూ ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసింది.

కొన్నాళ్లు ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు చేసుకోవాలని అభయహాస్తం పేరుతో ఆరు నెలలు గడిపింది. తాజాగా గ్రామ సభల పేరుతో సరికొత్త డ్రామాకు తెరతీసింది . దీనిలో భాగంగా మంత్రులు కాన్వాయ్ కంటే హెలికాప్టర్ లో ప్రయాణించడానికే సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నుండి ఖమ్మం జిల్లాకో.. ఆదిలాబాద్ జిల్లాకో అనుకుంటే హెలికాప్టర్ లో వెళ్ళోచ్చు. కానీ హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో రెండు గంటల్లోనో.. గంటలోనూ గమ్యం చేరుకునే జిల్లాలకు సైతం గాలిమోటర్ కావాలంటున్నారు మంత్రులు..

నిన్న కాక మొన్న వరంగల్ జిల్లా పర్యటనకెళ్ళిన ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు.. మంత్రులు కొండా సురేఖ ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఏకంగా హెలికాప్టర్ లో వెళ్లారు. అది మరిచిపోకముందే నల్గోండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు సైతం హెలికాప్టర్ లో వెళ్లారు. తాజాగా కరీంనగర్ పర్యటనకు మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హెలికాప్టర్ లో ప్రయాణం చేశారు.

మంత్రులు హెలికాప్టర్ లో ప్రయాణించడంలో తప్పు లేదు . కానీ గంటలోనూ.. రెండు గంటలోనూ వెళ్లాల్సిన చోటకు సైతం హెలికాప్టర్ వాడటంపై ఇటు రాజకీయ పక్షాల నుండి అటు విశ్లేషకుల నుండి విమర్శల వర్షం కురుస్తుంది. హెలికాప్టర్ ఏమి ఉచితంగా రాదు. దానికి గంటకో ఇంత అని ప్రజాధనాన్ని ఖర్చు చేయాలి.ఇప్పటికే ప్రకటనలకే… ప్రచారానికి ప్రజల సొమ్మును కోట్లలో ఖర్చు చేస్తున్నారు అని విమర్శలు విన్పిస్తున్న కానీ మంత్రులు ఇలా హెలికాప్టర్లు వాడటంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. బహుషా మళ్లీ అధికారంలోకి రాలేము.. అందుకే ఇప్పుడు అన్ని భోగాలను అనుభవిస్తున్నారు అని బీఆర్ఎస్ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *