హేమంత్ సోరెన్ కి కల్సివచ్చిన సెంట్మెంట్..!
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మరోసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని వార్తలు వస్తున్నాయి.
జైలుకు వెళ్లి రావడం ఆయనకు కలిసొచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సీఎం మయ్యా యోజన కింద మహిళలకు రూ.2,500 ఇస్తామనడం కూడా ఓట్లు రాలడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ప్రస్తుతం ఇండియా కూటమి 54 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.బీజేపీ 24స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తుంది. ఇప్పటికే మెజార్టీ మార్కును దాటడంతో ఇండియా కూటమిలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.