కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు..!
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై కీలక ఆదేశాలను జారీ చేసింది.
ఇందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు న్యాయవాదికి హైకోర్టు అనుమతిచ్చింది. కేటీఆర్, విచారణ అధికారి, న్యాయవాది వేర్వేరు గదుల్లో ఉండాలని సూచించింది.
అంతేకాకుండా కేటీఆర్ పై జరుగుతున్న విచారణ అంతా సీసీ కెమెరాల్లో కాస్ట్ అవ్వాలి. లైబ్రరీలో కేటీఆర్ న్యాయవాది కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలి. కేవలం చూడటానికి మాత్రమే అనుమతిస్తున్నాము. విచారణపై ఏమైన అభ్యంతరాలుంటే మళ్లీ కోర్టుకు రావోచ్చు అని ఆదేశాలిచ్చింది.