‘హైడ్రా’ పై హైకోర్టు అసహానం..!

High Court Serious on Hydra
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్.. బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను.. భవనాలను కూల్చి ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించడానికి తీసుకోచ్చిన సరికొత్త వ్యవస్థ హైడ్రా.. హైడ్రా ఏర్పడిన దగ్గర నుండి ఇటు ప్రతిపక్షాలు.. అటు గ్రేటర్ ప్రజల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్న సంగతి కూడా తెల్సిందే.
పలుమార్లు హైకోర్టు సైతం అక్షింతలు వేసింది. అయిన తీరు మార్చుకోని హైడ్రా మరోకసారి హైకోర్టు అగ్రహానికి గురైంది. నగరంలోని శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే నంబరు 18ఇలో 12,640 చదరపు గజాల స్థలంలోని నిర్మాణాలు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా హైడ్రా పేర్కొంది. దీంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపడుతున్నట్లుగా మేకల అంజయ్య తదితరులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయరా.. బాధితులకు నోటీసులు ఇచ్చిన వెంటనే కూల్చివేతలకు దిగుతారా..?.కనీసం ఇరవై నాలుగంటలైన సమయం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు అని హైకోర్టు తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసింది. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వడమే కాకుండా సమయం ఇచ్చి కూల్చివేయాలి తప్పా ఉన్నఫలంగా కూల్చి వేస్తే ఎలా అని తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసింది.
