పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్
తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో అధికారులపై జరిగిన దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెల్సిందే.
మాజీ ఎమ్మెల్యే అయిన తనను ప్రత్యేక బ్యారాక్ ఉంచాలని కోరుతూ ఈరోజు శుక్రవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ పిటిషన్ ను తిరస్కరించారు. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి నేరస్తులతో కల్సి ఒకే బ్యారక్ లో ఉన్నారు.