బ్యాంకింగ్ లోనే కనీవినని చరిత్ర
దేశంలోనే తొలిసారిగా బ్యాంకింగ్ చరిత్రలోనే కనీవినని విధంగా ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు..
రుణమాఫీకి అర్హులైన ముప్పై రెండు బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధితాధికారులు ప్రజాభవన్ లో సమావేశమయ్యారు..
ఈ సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం నాలుగు గంటల్లోపు పదకొండు లక్షల మంది రైతులకు సంబంధించిన లక్ష లోపు రుణాలన్నీ మాఫీ అవుతాయి..ఇందుకు సంబంధించి ఏడువేల కోట్లను వాళ్ల ఖాతాల్లో జమచేయబోతున్నాము..మిగతావి కూడా ఆగస్టు నెలలోపు మాఫీ అవుతాయని ..అందుకు బ్యాంకర్లు ఏర్పాట్లు చేస్కోవాలని సూచించారు..