భర్త మినిస్టర్..!. భార్య ఆఫీసర్..!!

 భర్త మినిస్టర్..!. భార్య ఆఫీసర్..!!

Shailaja Ramaiyer Ias

Loading

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వేముల వాడ పర్యటన సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వేములవాడ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యార్ స్వాగతం పలికారు.

ఈ క్రమంలోనే తన భర్త అయిన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కు సైతం ఆమె స్వాగతం పలుకుతూ పూల బోకే ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలకగా సమాధానంగా రేవంత్ రెడ్డి అన్నా.. వదిన అంటూ ఆయన నవ్వుతూ వారిని ఆత్మీయంగా పలరించారు.

అక్కడే ఉన్న మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటో బాగా దిగండి మళ్లీ ఇలాంటి సందర్భం వస్తుందో రాదో అంటూ నవ్వులు పూయించడంతో అక్కడున్నవారంతా కాసేపు నవ్వుకున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *