హైడ్రా కీలక నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ రంగనాథ్ తెలిపారు.
హైడ్రా ఏర్పాటుకు ముందున్న నిర్మాణాలను కూల్చివేయము. హైడ్రా ఏర్పాటైనాక నిర్మించిన అక్రమ కట్టడాలపైనే చర్యలు ఉంటాయి. ఎఫ్టీఎల్ లోని ప్రజలు నివాసం ఉంటున్న భవనాలను కూల్చబోము.
కాలనీ సంఘాలు చేస్తున్న పిర్యాధులకు తొలి ప్రాధాన్యత ఇస్తాము. హైడ్రా ఏర్పాటు తో ప్రజల్లో చైతన్యం పెరిగింది. స్థలాలు కొనేవారు.. భవనాలు నిర్మించుకునేవారు అన్ని ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు.