మీ ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను

 మీ ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను

Sai Pallavi

ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం ‘అమరన్’ బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో నితిన్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు ఆడియన్స్ కి బిగ్ థాంక్ యూ. ఈ సినిమాకి తమిళ్ లో ఎంత అప్రిసియేషన్ వచ్చిందో తెలుగు నుంచి కూడా అంత గొప్పగా అప్రిసియేషన్ వచ్చింది. మీ అందరి ప్రేమని ఎక్స్పీరియన్స్ చేశాను. ఆడియన్స్ ఒక్కొక్క ఎమోషన్ కి రియాక్ట్ అవుతున్నారు అని తెలిసినప్పుడు నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఎక్కడైనా ఒక మంచి సినిమా ఉందంటే తెలుగు ఆడియన్స్ ఎంతో గొప్పగా ఆదరిస్తారు. భానుమతి, వెన్నెల.. ఇలా నా సినిమాల్లో ఎన్నో పాత్రలతో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో చేసిన ఇందు పాత్రకి కూడా అంతే గొప్పగా రెస్పాన్స్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీరు ఇస్తున్న ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలనే ఎనర్జీ వస్తుంది.

డైరెక్టర్ గారు చాలా అద్భుతమైన పాత్రను ఇచ్చారు. ప్రతి ఎమోషన్ ని చాలా క్లారిటీగా చూపించారు. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ గారికి వస్తున్న అప్రిషియేషన్ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. శివ కార్తికేయన్ గారు ఒక తెలుగు ఇంటి అబ్బాయిలా వునంరు. తెలుగులో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మేము నటించిన ‘అమరన్’ సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తర్వాత వచ్చే సినిమాలన్నీ కూడా చాలా పెద్ద హిట్ లు కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని తెలుగులో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసిన సుధాకర్ రెడ్డి గారికి థాంక్యూ. నితిన్ గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది . అలాగే సునీల్ గారికి, డైరెక్టర్ వెంకీ గారికి అందరికీ థాంక్యు. ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్. మీ ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *