నేనే రాజు. మంత్రి.. నన్ను ఎవడ్రా ఆపేది..!

ఆయన మంత్రి కాదు.. ఎమ్మెల్యే కాదు..జెడ్పీ చైర్మన్ కాదు. జెడ్పీటీసీ ఎంపీటీసీ అఖరికి వార్డు మెంబర్ కూడా కాదు. కానీ ఆ నియోజకవర్గంలో జరిగే ప్రతి అధికార అనాధికార కార్యక్రమాల్లో పాల్గోంటారు. ప్రతిపక్షం నుండి ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నా.. విమర్శలు విన్పిస్తున్నా కానీ నేనే రాజు.. నేనే మంత్రి.. నన్ను ఎవడ్రా ఆపేదంటూ దూసుకెళ్తున్నారు.
ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా.?. ఇంకా ఎవరి గురించి స్వయనా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి. ఇటీవల కొడంగల్ లో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉంటాను. నాకు సమయం ఉండదు. కానీ కొడంగల్ లో ఎవరికి ఏ కష్టమోచ్చిన.. ఏ సమస్య వచ్చిన నా సోదరుడు తిరుపతి రెడ్డి చూసుకుంటాడు అని అన్నారు.
తాజాగా ఆ వ్యాఖ్యలను నిజం చేస్తూ తిరుపతి రెడ్డి తనకు ఏ పదవి లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని కొడంగల్ – దుద్ద్యాలలో ఏర్పాటు చేసిన ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడితో ఆగకుండా ఏకంగా 13 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. కనీసం వార్డ్ మెంబర్ పదవి కూడా లేని తిరుపతి రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాడంటూ ఇటు ప్రతిపక్ష అటు ప్రజల… నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
