కొండ నాలుకకి ఉప్పు వేస్తే ఉన్న నాలుక ఊడింది..!

Telangana government is good news for farmers..!
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ ఎవరో తీయాల్సిన అవసరం లేదనుకుంటా.?.వాళ్లకు వాళ్ళే తీసేసుకున్నారు.కాలర్ ఎగరేద్దామనుకున్నారో ఏమో గాని…. చేసిన అతికి ఉన్న గాలి మొత్తం పోయింది.వాళ్లకు వాళ్లే సెల్ఫ్ గోల్ చేసుకోబోయి బొక్క బోర్లా పడ్డ పరిస్థితి.కాంగ్రెస్ సోషల్ మీడియా నిర్వాకం వల్ల…కారు పార్టీకి మైలేజ్ వచ్చినట్టయ్యింది.ఇప్పుడు గులాభి సైన్యం ఫీలింగ్ ఎలా ఉందంటే… విదేశీ గడ్డపై వరల్డ్ కప్ సాధించిన ఆనందంతో ఉంది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే…
ఈరోజు ఉదయం తెలంగాణా కాంగ్రెస్’ అధికారిక X ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. ఓ విధంగా అతి చేసింది.పరువు మొత్తం పోయాకా ఆ పోస్టును పిన్ కూడా చేసేసింది లేండి. ట్వీట్ లో తెలంగాణా కాంగ్రెస్ కోరిందేమిటంటే..? తెలంగాణా రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారు? ఫాం హౌజ్ పాలనా? ప్రజల వద్దకు పాలనా? అనే ప్రశ్నలతో పోల్ ట్వీట్ చేసింది కాంగ్రెస్ సోషల్ మీడియా. ఫాం హౌజ్ పాలనకు 73.5 శాతం, ప్రజల వద్దకు పాలనకు 26.5 శాతం నెటిజన్లు తమ స్పందనను తెలియజేశారు.
ప్రస్తుతానికి ఈ ట్వీట్ మాయమైందనేది వేరే విషయం.అయితే డిలీట్ కాకముందే బీఆర్ఎస్ సోషల్ మీడియా అలర్ట్ అయ్యింది.స్క్రీన్ శాట్ లను తెగ వైరల్ చేసేసింది.మీరు ఫాం హౌస్ పాలన అని వెకిలి చేష్టలతో పోస్ట్ చేస్తే 70 % మెజార్టీ దాటిందని అదే బీఆర్ఎస్ పాలన అంటూ చేస్తే 100% వచ్చేదని సైటైర్ల తో పోస్టులు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
నిజానికి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే ఒప్పుకున్నారు.కాంగ్రెస్ సోషల్ మీడియా చాలా వీక్ అని. ఈ పరిస్థితుల్లో అనవసర పోస్ట్ చేసి మరింత చులకన అయ్యారనేది అందరి వాదన.అసలే రేవంత్ సర్కార్ పై జనంలో అసంతృప్తి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది.ఏడాది పాలనలో చెప్పుకోదగ్గ హామీలు అమలు కావడం లేదని ప్రజల మాట. ఆ వ్యతిరేకత నుంచి బయట పడేందుకు ఏదో ఒక ఇష్యూ ముందుకు తెస్తూ కాలం వెళ్లదీస్తున్నా…..వారి సోషల్ మీడియా సైన్యం మాత్రం పరువు బజారుకీడుస్తుంది.
ఇదీ సోషల్ మీడియా ట్రెండ్.
స్మార్ట్ ఫోన్ యూజర్స్ ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది.అందుకే ఏ పని చేసినా ఆచి తూచి వ్యవహరించాలని తాజా పరిణామం కాంగ్రెస్ పార్టీకి ఓ హెచ్చరిక గా మారింది.ఇక అంతా అయిపోయాకా నెటిజన్లు ఏమంటున్నారో తెలుసా……చూసుకోవాలిగా రేవంత్ గారూ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
