నువ్వు మగాడివైతే..?- రేవంత్ కి కేటీఆర్ సవాల్..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో నందినగర్ లో బీఆర్ఎస్ నేతలతో.. తన లీగల్ టీమ్ తో ఆయన సమావేశమయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఈ కేసు లొట్ట పీసు కేసు. ఫార్ములా ఈ రేసు కారు వ్యవహారంలో అవినీతి జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ఎల్పీ నుండి స్పీకర్ కు లేఖ రాసిన స్పందించలేదు. నిజంగా అవినీతి కుంభకోణాలు జరిగి ఉంటే నాడు చర్చకు ఎందుకు అనుమతించలేదు.
రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు మగాడివైతే ఈ అంశంపై నీ జూబ్లీహిల్స్ ప్యాలెన్స్ లో చర్చ పెడదాము. మీడియా ఛానెళ్లన్నింటీని పిలుద్దాము. బహిరంగంగా చర్చించుదాం. ఎవరిది తప్పు అయితే వాళ్ళు జైలుకెళ్తారు. అప్పుడు ఈడీ కాదు ఏసీబీ కాదు సీబీఐ విచారణకు సైతం తాను ఒక్కడ్నే హాజరు అవుతానని బహిరంగ సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్.