ప్రశ్నిస్తే అరెస్ట్ లా..?-మాజీ మంత్రి హారీశ్ రావు.

 ప్రశ్నిస్తే  అరెస్ట్ లా..?-మాజీ మంత్రి హారీశ్ రావు.

Loading

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు.. బీఆర్ఎస్ సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు హుజుర్ బాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసులా? అని ప్రశ్నించారు.

పదేండ్ల కేసీఆర్ గారి పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయంగా ఆయన పేర్కొన్నారు.ప్రశ్నిస్తున్న ప్రజా ప్రతినిధులపై అక్రమంగా కేసులు బనాయించడం, నిలదీస్తే పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు.

ఆరు గ్యారంటీలు, హామీల అమలు, పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు, అడిగితే అరెస్టులు.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా?.ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారు.

మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బిఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాము.
అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని తక్షణం విడుదల చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని” ట్వీట్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *