అమ్రపాలి కీలక ఆదేశాలు
హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్,సినిమా థియేటర్ల గురించి కమీషనర్ ఆఫ్ జీహెచ్ఎంసీ అమ్రపాలి కాట (ఐఏఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా పార్కింగ్ గురించి పలు మార్గదర్శకాలను అమ్రపాలి విడుదల చేశారు.
నగరంలో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్,సింగిల్ ,మల్టీ స్క్రీన్స్ ఉన్న అన్ని థియేటర్లలో పార్కింగ్ వసూళ్లపై వస్తోన్న పిర్యాదులతో అప్రమత్తమైన అమ్రపాలి పార్కింగ్ బిల్లుల గురించి కీలక ఆదేశాలను జారీ చేశారు. తొలి ఆర్ధగంట వరకు ఎలాంటి బిల్లును వసూలు చేయకూడదని తెలిపారు.
ఒకవేళ పార్కింగ్ బిల్లులను వసూలు చేయాలనుకుంటే ఆ బిల్లు పూర్తి వివరాలను షాపింగ్స్ మాల్స్, థియేటర్లలో ప్రదర్శించాలి.. షాపింగ్ చేసిన .. సినిమా చూసిన బిల్లులుంటే పార్కింగ్ బిల్లు వసూలు చేయకూడదని హెచ్చారించారు. ప్రతి సర్కిళ్ లో టీమ్స్ ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతామని ఈ సందర్భంగా అన్నారు.