ఇంగ్లాండ్ రికార్డును బద్దలు కొట్టిన భారత్
కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా అనేక రికార్డులను నెలకొల్పింది. టెస్ట్ ల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది.
ఈ ఏడాది పద్నాలుగు ఇన్నింగ్స్ లలోనే తొంబై సిక్సులను కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించింది.బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్ లో ఈ ఫీట్ ను సాధించి 2022లో ఇంగ్లాండ్ ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్ లలో ఎనబై తొమ్మిది సిక్సుల రికార్డును భారత్ బద్దలు కొట్టింది.
ఈ ఏడాది మరిన్ని టెస్ట్ మ్యాచ్ లున్న నేపథ్యంలో భారత్ సరికొత్త రికార్డులను నెలకొల్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి.